కర్నూలులో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. నగరంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలను... వినాయక ఘాట్ వద్దనున్న కే.సీ.కాలువలో నిమజ్జనం చేశారు. ప్రతి సంవత్సరం 1500 విగ్రహాల నుంచి రెండు వేల వరకు ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది కరోనా కారణంగా రెండు నుంచి ఐదు అడుగుల విగ్రహాలను వందలోపు ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా వేద పండితులు గంగా హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ డీ.కే.బాలాజీ, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ... చదరంగం స్వర్ణ విజేతలకు చంద్రబాబు, లోకేశ్ అభినందనలు