కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో దసరా సందర్భంగా... కర్రల సమరాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా విస్తృతి నేపథ్యంలో ఈ ఏడాది దీన్ని రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. ఆలయ పరిసరాల్లో ఇప్పటికే బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి ప్రతి ఏడాది భారీ సంఖ్యలు భక్తులు ఈ కర్రల సమరంలో పాల్గొనేవారు. ఈ ఏడాది ఉత్సవాలు నిషేదించటంతో..దేవరగట్టు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఉత్సవాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మరో వైపు బన్ని ఉత్సవం అనాధిగా వస్తున్న ఆచారమని..,కచ్ఛితంగా నిర్వహిస్తామని కొందరు భక్తులు పట్టుపట్టి కుర్చున్నారు. దీంతో ఇవాళ రాత్రి జరగనున్న బన్ని ఉత్సవం ప్రాధాన్యత సంతరించుకోవటంతో పాటు స్థానికుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇదీచదవండి