కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేని విధంగా కర్నూలు జిల్లాలోనే వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కొత్తగా 24 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 411కు చేరింది. అందులో 335 మంది చికిత్స పొందుతున్నారు. 66 మంది కోలుకోగా.. 10 మంది మృతి చెందారు. అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా కట్టడి కావడం లేదు.
ఇదీ చదవండి...