ఇదీ చదవండి..'కరోనా'తో తీరని వేదన.. సినీ పరిశ్రమ కుదేలు
సీఏఏ, ఎన్ఆర్సీలకు మద్దతుగా డోన్ లో మహా ర్యాలీ - bjp rally in kurniil
జన జాగరణ సమితి ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్ఆర్సీలకు మద్దతుగా కర్నూలు జిల్లా డోన్ లో మహా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
సీఏఏ, ఎన్ఆర్సీలకు మద్దతుగా డోన్ లో మహా ర్యాలీ
సీఏఏ, ఎన్ఆర్సీలకు మద్దతుగా జన జాగరణ సమితి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా డోన్ లో మహార్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. దేశాన్ని కల్లోల భరితంగా మార్చడానికి సంఘ విద్రోహ శక్తులు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనించాలని కోరారు. పట్టణంలోని భాజపా కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ముస్లింలు అపోహలు నమ్మవద్దని అన్నారు. ప్రజాస్వామ్య వాదుల ముసుగులో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ చట్టం భారత దేశ పౌరులకు మాత్రమే వర్తిస్తుందని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి..'కరోనా'తో తీరని వేదన.. సినీ పరిశ్రమ కుదేలు