తన ఇంటిని ఓ పోలీసు అధికారి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద సయ్యద్ షరీఫ్ అనే వ్యక్తి గురువారం ఆందోళన చేశారు. నగరంలోని లక్ష్మీ గార్డెన్స్ వద్ద తనకు ఇల్లు ఉందని... దానికి రెండో పట్టణ ఏఎస్సై షేక్ మెహబూబ్ బాషా నకిలీ పట్టా తయారు చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. జిల్లా ఎస్పీకి దీనిపై ఫిర్యాదు చేశానని... అయినా ఏఎస్సైలో మార్పు రాలేదని చెప్పారు.
ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు, ఇంటి పన్ను, కుళాయి పన్ను, విద్యుత్ బిల్లులన్నీ తన పేరు మీదే ఉన్నాయని సయ్యద్ షరీఫ్ మీడియాకు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి