- VENKATRAMIREDDY : 'ఉద్యోగుల అభిప్రాయం తీసుకుని కొత్త జీవోలు ఇవ్వాలి'
పీఆర్సీ జీవోలన్నింటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. ఐక్యవేదిక ఏర్పాటుపై అన్ని సంఘాలతో చర్చిస్తామని చెప్పారు. రెండు మూడ్రోజుల్లో సమస్యను పరిష్కరించని పక్షంలో అన్ని సంఘాలతో కలిసి ఉమ్మడి పోరాట కార్యాచరణను ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రగతిభవన్ వద్దకు వచ్చిన మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ వద్దకు వచ్చిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా అనుమతించబోమని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- PHOTO SHOOT : వేడుక ఏదైనా...వేదిక సిద్ధం
పెళ్లిళ్లు... పుట్టిన రోజులు... బారసాల....అన్నప్రాసనలు...వేడుక ఏదైనా అతిథులను ఆహ్వానించే ట్రెండ్ మారిపోయింది. శుభలేఖలు, ఆహ్వానపత్రికల స్థానంలో వీడియో షూట్‌లతో సరికొత్తగా రారమ్మని పిలుస్తున్నారు. ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యే కొత్త జంటలు ఇప్పుడు ప్రి వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్‌లతో సందడి చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Junior Artist Died :స్టేషన్ వచ్చిందనుకుని రైలు దిగింది...కాదని తెలిసి ఎక్కుతుండగా...
Woman died in Train Accident: కదులుతున్న రైలు ఎక్కబోయి కింద పడిన మహిళ తీవ్రగాయాలకు గురై మరణించిన సంఘటన తెలంగాణలోని షాద్‌నగర్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. మృతురాలు ఏపీలోని కడప వాసిగా పోలీసులు గుర్తించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగిగా చేస్తూ.. జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తోందని వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు
Covid cases in India: భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మరో 2,82,970 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజు 441 మంది మరణించారు. 1,88,157 మంది కొవిడ్‌ను జయించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఎన్నికల వేళ కలకలం.. సీఎం మేనల్లుడి ఇంట్లో రూ.8కోట్లు సీజ్!
Punjab mining raids: ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంలో పంజాబ్‌లో వేర్వేరు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ సోదాలు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్‌కు చెందిన ఇళ్లలోనూ ఈడీ దాడులు జరిపింది. ఆయన నివాసాల్లో రూ. 8 కోట్ల మేర నగదు స్వాధీనం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ దాడులు కలకలం రేపుతున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఆ మహిళ అదిరే ఫీట్- మరోసారి బుర్జ్ ఖలీఫాపై ప్రత్యక్షం!
Burj Khalifa Woman Standing: అరబ్ నగరం దుబాయ్‌కే మకుటాయమాణంగా నిలుస్తున్న బుర్జ్ ఖలీఫాపై ఆ మహిళ మరోసారి ప్రత్యక్షమైంది. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో 830 మీటర్ల ఎత్తున నిలబడి తానిక్కడే ఉన్నానంటూ పలకరించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Stock Market: ఐటీ షేర్లు కుదేలు- భారీ నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు కూడా నేడు ప్రతికూలంగా కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- IND vs SA 1st ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
IND vs SA 1st ODI: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది టీమ్ఇండియా. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Akhanda movie: బాలయ్య 'అఖండ' అరుదైన ఘనత
Akhanda 50 days: బాలయ్య 'అఖండ' మరో ఘనత సాధించింది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు సాధ్యం కాని విధంగా థియేటర్లలో 50 రోజులు ప్రదర్శితమైంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.