ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM

ప్రధాన వార్తలు @ 9 PM

author img

By

Published : Aug 31, 2021, 8:58 PM IST

TOP NEWS @9PM
ప్రధాన వార్తలు @9PM
  • రేపే 2 బోర్డుల కీలక భేటీ.. నిలదీసేందుకు రాష్ట్ర అధికారులు సిద్ధం!
    శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణా చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిపై లేఖల మీద లేఖలు రాస్తున్నా.. కేఆర్ఎంబీ చర్యలు తీసుకోకపోవటాన్ని ప్రశ్నించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​తో చర్చించా'
    రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​తో చర్చించినట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు. ఐఐఎఫ్‌టీ, ఐఐపీ ఏర్పాటు గురించి కూడా కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు?: లోకేశ్
    పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. కూనవరం మండల పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాసితులతో మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు: మంత్రి గౌతంరెడ్డి
    రాజధాని అంశంపై ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అని తెలిపారు. పులివెందుల, విజయవాడ కావొచ్చు.. రేపు మరో ప్రాంతం కావొచ్చన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వ్యాక్సినేషన్​లో దూసుకెళ్తున్న భారత్- మళ్లీ కోటి డోసులు
    దేశంలో టీకా పంపిణీ(vaccination in india) ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. తాజాగా.. మంగళవారం కోటికిపైగా వ్యాక్సిన్​ డోసులు(1 crore vaccination in india) పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఐదు రోజుల్లో టీకా పంపిణీ మార్క్​ కోటి దాటడం ఇది రెండోసారి కావడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అఫ్గాన్​ పరిస్థితులపై కేంద్రం చర్చ- మోదీ కీలక ఆదేశాలు!
    అఫ్గానిస్థాన్​లో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వ అత్యున్నత స్థాయి బృందం సమావేశమైంది. విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సహా సీనియర్ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తాలిబన్లతో భారత్ చర్చలు- కీలక నేతతో భేటీ
    అఫ్గాన్​ సంక్షోభం నేపథ్యంలో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఖతార్​లోని భారత రాయబారి దీపక్​ మిట్టల్​, తాలిబన్​ నేత షేర్​ మహమ్మద్​ అబ్బాస్​ స్టానెక్జాయ్​.. దోహా వేదికగా భేటీ అయ్యారు. భారత్​- తాలిబన్ల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దేశ జీడీపీ రికార్డు- క్యూ1లో 20.1 శాతం వృద్ధి
    భారత జీడీపీ వృద్ధి రేటు బలంగా పుంజుకుంది. కరోనా రెండో దశ ప్రభావం ఉన్నప్పటికీ.. మెరుగైన వృద్ధిని సాధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో 20.1 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో దేశ జీడీపీ 24.4 శాతం పతనమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హైజంప్​లో భారత్​కు రజతం, కాంస్యం
    టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే 8 పతకాలు సాధించిన భారత అథ్లెట్లు మరో రెండు పతకాలు అందించారు. పురుషుల హైజంప్‌ టీ63 విభాగంలో మరియప్పన్‌ తంగవేలు రజతంతో మెరిశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • DRUGS CASE : డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. విచారణకు హాజరైన పూరి
    టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభమైంది. సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఈడీ ఎదుట హాజరయ్యారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు పూరి జగన్నాథ్​కు ఇది వరకే నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.