ETV Bharat / city

'ఎమ్మెల్సీ కుటుంబం నుంచి ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించండి' - అనంతబాబు తాజా వార్తలు

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబ సభ్యులు తమను బెదిరించారంటూ.. హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం బాబాయి వీధి శ్రీను కాకినాడ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతబాబు తల్లి, అక్క తమ కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించారని.. ఎమ్మెల్సీ జైలు నుంచి విడుదలయ్యాక అంతమొందిస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్సీ కుటుంబం నుంచి ప్రాణహాని ఉంది
ఎమ్మెల్సీ కుటుంబం నుంచి ప్రాణహాని ఉంది
author img

By

Published : Jul 7, 2022, 9:04 AM IST

ఎమ్మెల్సీ కుటుంబం నుంచి ప్రాణహాని ఉంది

ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని హత్యకు గురైన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం చిన్నాన్న వీధి శ్రీను కాకినాడ రెండో పట్టణ పోలీసులను బుధవారం ఆశ్రయించారు. ప్రజా, దళిత సంఘాల నాయకులతో కలిసి స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తమ అన్నయ్య కుమారుడి హత్య కేసులో సాక్షులుగా ఉన్న తమకు ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయన్నారు. ఈ నెల 5న మధ్యాహ్నం ఎమ్మెల్సీ అనంతబాబు తల్లి, అక్క.. తన కుమార్తెలను కులం పేరుతో అసభ్యంగా తిడుతూ.. "మిమ్మల్ని మేమే ఇక్కడ పనిలో పెట్టాం.. ఆ విశ్వాసం లేకుండా నా కుమారుడిని జైలు పాలు చేస్తారా అంటూ.. మా వాడు బయటకు రాగానే మీ అంతు చూస్తాం" అంటూ బెదిరించారని ఆయన తెలిపారు. సాక్షులుగా ఉన్న మమ్మల్ని చంపుతామని బెదిరించిన ఎమ్మెల్సీ తల్లి, సోదరిపై చర్యలు తీసుకుని మా ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరామని తెలిపారు.

సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులుగా ఉన్న వీధి శ్రీను, అతడి కుటుంబీకులకు రక్షణ కల్పించి.. బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని దళిత, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండు చేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులుగా ఉన్న అతడి చిన్నాన్న వీధి శ్రీను, ఆయన కుటుంబ సభ్యులను దళిత, ప్రజా సంఘాల ప్రతినిధులు పిట్టా వరప్రసాద్‌, తోకల ప్రసాద్‌, అయితాబత్తుల ఆనందరావు, ఏనుగుపల్లి కృష్ణ, తాళ్లూరి రాజు తదితరులు కలిసి ధైర్యం చెప్పారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.