తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. బ్లాక్ ఫంగస్ సోకిన 15 నెలల చిన్నారికి వైద్యులు ప్రాణం పోశారు. జిల్లాలోని పెనుగొండకు చెందిన జానకీ నందన్ అనే బాలుడికి 15 రోజుల క్రితం బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడ్డాయి. తల్లిదండ్రులు ఆ పసివాడ్ని కాకినాడ జీజీహెచ్‌లో చేర్పించి చికిత్స అందించారు. ఈ నెల మూడో తేదీన వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. వైద్యులకు బాలుడి తల్లి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి..
Missing mother found: నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన తల్లి..ఇన్నాళ్లు ఎక్కడుందంటే..!