ఎట్టి పరిస్థితుల్లో రైతులు పండించిన పంట నష్టపోకూడదని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారని మంత్రి కన్నబాబు అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కరోనా నేపథ్యంలో ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నామన్న ఆయన...పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి మార్కెట్లకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ, అనుబంధ రంగాలపై రోజూ సమీక్షలు చేసుకుంటున్నామని అన్నారు. అరటి రైతులు ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవమే అన్న మంత్రి కన్నబాబు... రోజుకు 2 వేల టన్నులు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గొనే సంచులు రావాల్సి ఉందని అన్నారు. క్షేత్రస్థాయిలోని సమస్యల పరిష్కారానికి 1902, 1907 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మంత్రి కన్నబాబుతో ఈటీవీ భారత్ నిర్వహించిన ఈ ఫోన్ఇన్ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది రైతులు ఫోన్ చేసి తమ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు.
ఇదీ చదవండి :