'గతంలో నిర్మించిన ఇళ్లు తక్షణమే లబ్ధిదారులకు ఇవ్వాలి' - కాకినాడ నగర మాజీ ఎమ్మెల్యే కొండబాబు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్లను లబ్ధిదారులకు తక్షణం అందజేయాలని కాకినాడ నగర మాజీ ఎమ్మెల్యే కొండబాబు డిమాండ్ చేశారు. పర్లోవుపేటలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ఆయన పరిశీలించారు. పేదవారి సొంతింటి కలను నెరవేర్చాలన్న ఆశయంతో తెదేపా కాకినాడలో తొలివిడతగా 1200 గృహాలను నిర్మించిందని చెప్పారు. ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయకుండా పేదలతో వైకాపా ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు.
లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించిన కాకినాడ నగర మాజీ ఎమ్మెల్యే కొండబాబు
By
Published : Mar 4, 2020, 1:31 PM IST
.
లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించిన కాకినాడ నగర మాజీ ఎమ్మెల్యే కొండబాబు