ETV Bharat / city

కాపులను విస్మరిస్తే సహించేది లేదు: జ్యోతుల నెహ్రూ

కాపులను విస్మరిస్తే సహించేది లేదని మాజీ శాసన సభ్యుడు, తెదేపా నేత జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. ఈబీసీ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయించడం కుదరదని ముఖ్యమంత్రి చెప్పడం సరికాదన్నారు.

కాపులను విస్మరిస్తే ఊరుకోం:తెదేపా నేత జ్యోతుల నెహ్రు
author img

By

Published : Jul 28, 2019, 2:32 PM IST

Updated : Jul 28, 2019, 3:05 PM IST

కాపులను విస్మరిస్తే ఊరుకోం:తెదేపా నేత జ్యోతుల నెహ్రు
వైకాపా ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు కాపులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో కార్పొరేషన్ ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కాపులను రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్..ఈబీసీ రిజర్వేషన్లను ప్రత్యేకంగా వర్గీకరించటం కుదరదని చెప్పటం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా ఆమోదం పొందిన నిర్ణయాన్ని తేలిగ్గా తీసుకున్నారని... కనీసం చర్చకు తీసుకురాకుండా తోసిప్పుచ్చారని మండిపడ్డారు. ఇప్పటికైనా కాపు రిజర్వేషన్లపై కేంద్రంపై పోరాడాలని సూచించారు. లేకపోతే భవిష్యత్తులో తెదేపా ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేపడుతున్నామని హెచ్చరించారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం రైతు బంధు కింద రూ.12,500 ఇస్తామని, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఆర్థికసాయం చేస్తామన్నారని గుర్తు చేశారు. ఇప్పుడేమో కేంద్ర సాయం కలుపుకుని రూ.12,500 ఇస్తామని అంటున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. మడమ తిప్పడం అంటారో.. మాట తప్పడం అంటారో మీరే నిర్ణయించుకోవాలంటూ ఎద్దేవా చేశారు.

Intro:అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ప్రసిద్ధిగాంచిన దుర్గమ్మ అమ్మవారికి బోనాల సమర్పించేందుకు వందలాది మంది మహిళలు తరలివచ్చారు పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా ఊరేగింపుగా దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించిన మొక్కుబడులు తీర్చుకున్నారు ఆషాడ మాసం ఆదివారం కావడంతో పట్టణంలోని పలు కాలనీలలో నుంచి బోనాలను తలపై ఉంచుకుని ఆలయం వరకు కాలినడకన వచ్చారు రు చిన్నారులు సైతం బోనాలను ఎత్తుకొని అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించారు

Body:దుర్గమ్మ అమ్మవారికి బోనాలు

Conclusion:అనంతపురం జిల్లా
Last Updated : Jul 28, 2019, 3:05 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.