తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో.. హఠాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. ప్రయాణికులను బస్సు నుంచి కిందికి దించాడు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు.
బయల్దేరిన కొద్దిసేపటికే బస్సులో మంటలు చెలరేగాయని డ్రైవర్ చెప్పారు. కాకినాడ నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఆర్టీసీ బస్సులో ఈ ప్రమాదం జరిగింది. ప్రాణాపాయం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: