ETV Bharat / city

సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ - సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న... అన్న స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నారు సత్యసాయి సేవా సంస్థ సభ్యులు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్కులు దొరకని పరిస్థితి ఉంది. తూర్పుగోదావరి జిల్లా సత్యసాయి సేవా సంస్థలోని మహిళా సేవా విభాగం సభ్యులు... మాస్కులు తయారుచేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కరోనా వైరస్ సోకకుండా హోమియోపతి మందులనూ ఇస్తున్నారు.

Distribution of masks under Satya Sai service organization
సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ
author img

By

Published : Mar 27, 2020, 1:16 PM IST

సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, రావులపాలెం, రాజోలు, ఊబలంక, అమలాపురం ప్రాంతాల్లోని సత్యసాయి సేవా మందిరాల్లో మాస్కులు తయారు చేస్తున్నారు. మహిళా విభాగం సభ్యులు ప్రతిరోజు సేవా కేంద్రాల వద్దకు వచ్చి కుట్టు మిషన్​పై కుడుతున్నారు. ప్రజలకు సేవలు అందించే వైద్య సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ అధికారులు, వాలంటీర్లకు, ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు. మార్కెట్లో దొరికే కొన్ని మాస్కులు ఒకరోజు మాత్రమే పనిచేస్తాయి. ఈ సేవా సంస్థల ద్వారా వాషబుల్ మాస్కులు అందిస్తున్నారు. ప్రతిరోజూ వీటిని పెట్టుకుని సాయంత్రం సబ్బు, డెటాల్​తో శుభ్రం చేసి మళ్లీ వినియోగించవచ్చు. జిల్లాలో ప్రస్తుతం 10 వేల మాస్కులు పంపిణీ చేశారు.

ఇదీ చదవండీ... 'ఆశ‌తో నడుస్తున్నాం... కానీ ఎమవుతుందో..?'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.