బ్లాక్ ఫంగస్ బాధితులు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఖరీదైన మందులు కొనుగోలు చేయలేకపోతున్నామని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. మందులు ఉచితంగా ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు.
బ్లాక్ ఫంగస్ నుంచి కొలుకున్నప్పటికీ కొంతకాలం పాటు ముందులు వాడాల్సి ఉందని బాధితులు తెలిపారు. లేకుంటే ఈ వైరస్ తిరిగి సోకే ప్రమాదం ఉందని వైద్యులు సూచించినట్లు వెల్లడించారు. క్రమం తప్పకుండా వేసుకోవాల్సిన ఈ మందులను ప్రభుత్వం ఉచితంగా అందుబాటులో ఉంచకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీదైన ఈ మందులను కొనుగోలు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ.. Results: ఈ ఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల