Steps to expel Kondareddy from the district: వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులకు చెందిన వైకాపా నేత వైఎస్ కొండారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించేందురు చర్యలు చేపట్టారు. ఆయన బహిష్కరణపై ఎస్పీ అన్బురాజన్ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. ఎవరైనా బెదిరింపులు, అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా బెదిరిస్తే 100, 14400, 9440796900కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎస్‌ఆర్‌కే కన్స్ట్రక్షన్స్ గుత్తేదారును బెదిరించిన కేసులో కొండారెడ్డిని పోలీసులు సీఎం జగన్ ఆదేశాలతో అరెస్టు చేశారు. అయితే.. కొండారెడ్డి ఇవాళ బెయిల్పై విడుదలయ్యారు. జైలునుంచి విడుదలైన కొండారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
అరెస్టు.. విడుదల : వైఎస్‌ఆర్ జిల్లా చక్రాయపేట మండలం వైకాపా ఇన్‌ఛార్జిగా ఉన్న ఆయన.. ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్ గుత్తేదారులను బెదిరించారు. ఈ క్రమంలో పులివెందుల-రాయచోటి మార్గంలో జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. దీంతో గుత్తేదారులు చక్రాయపేటలో కొండారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అక్కడి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. కొండారెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా ఆ తర్వాత బెయిల్ పై కొండారెడ్డి విడుదలయ్యారు. విడుదలైన ఆయనను జిల్లా నుంచి బహిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి :