కడప నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ రెస్టారెంట్లో రెండు రోజులుగా నిల్వ ఉంచిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. వాటిని వేడిచేసి వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కొన్ని పదార్థాలు తినడానికి పనికి రాని విధంగా ఉన్నట్లు తెలిపారు. వాటిపై బ్లీచింగ్ పౌడర్ చల్లి ట్రాక్టర్లో తరలించారు. అనంతరం రాయచోటి రోడ్డులోని ఓ బేకరీ దుకాణంపై అధికారులు తనిఖీలు చేశారు. ఆహార పదార్థాల నమూనాలను ల్యాబ్‌కు పంపి పరీక్షిస్తామని... సరైన ప్రమాణాలు లేకపోతే దూకాణాలపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ హోటళ్లపై ఫిర్యాదులు రావటంతోనే తాము తనిఖీలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఫుడ్ సేప్టీ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: