కడప నగరానికి చెందిన కార్పొరేటర్ బోలా పద్మావతి బెస్త కరోనా సోకి మృతి చెందారు. ఆమె మరణంపై ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా సంతాపం తెలిపారు. వరుసగా ఆరుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రజలకు సేవలందించిన పద్మావతి.. ఇక లేరనే విషయం బాధాకరమన్నారు. నగరంలోని వైకాపా కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఓటమి ఎరుగని ధీర వనిత..
1987లో కౌన్సిలర్‌గా ఎన్నికైన పద్మావతి.. వరుసగా ఆరు సార్లు పదవి చేపట్టారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. తాజాగా జరిగిన నగర పాలక ఎన్నికల్లో ఏకగ్రీవంగా అత్యధిక ఆధిక్యంతో గెలుపొంది కార్పొరేటర్ అయ్యారని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఓటమి ఎరగని గొప్ప రాజకీయ నాయకురాలు అని ఆయన కొనియాడారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ అవినాష్, మేయర్ సురేశ్ బాబు, కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి , నగర పార్టీ అధ్యక్షురాలు వెంకటసుబ్బమ్మ , అధ్యక్షుడు సునీల్ కుమారు, యువజన అధ్యక్షుడు నిత్యానంద రెడ్డి సహా ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: