ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM

..

author img

By

Published : Sep 1, 2021, 8:59 PM IST

ప్రధాన వార్తలు @9PM
TOP NEWS @9PM
  • 'రైతులకు అవాంతరం లేకుండా ఉచిత విద్యుత్​ సరఫరా చేయడమే లక్ష్యం'
    రైతులకు అవాంతరాల్లేని ఉచిత కరెంటు ఇవ్వడమే లక్ష్యమని సీఎం జగన్​ అన్నారు. దీనికోసం 10వేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టును తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు అమర్చడం ద్వారా ఎంత కరెంటు వాడుతున్నారు.. ఎంత లోడ్‌ పడుతుందనే విషయం తెలుస్తుందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జల విద్యుదుత్పత్తిలో ఛైర్మన్ నిర్ణయంపై తెలంగాణ అసంతృప్తి..వాకౌట్​
    తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న కృష్ణా జలాల వివాదంపై చర్చించేందుకు కేఆర్ఎంబీ ఏర్పాటు చేసిన సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ చేసింది. నీటిని సమాన నిష్పత్తిలో పంపిణీ చేయాలని తెలంగాణ తరఫున అధికారి విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సునీల్‌ యాదవ్‌కు నార్కో పరీక్షలకు అనుమతి నిరాకరణ
    వివేకా హత్య కేసులో సీబీఐ వేసిన నార్కో పిటిషన్​ను కోర్టు డిస్మిస్ చేసింది. సునీల్ యాదవ్‌కు నార్కో పరీక్షలకు అనుమతించాలని సీబీఐ వేసిన పిటిషన్​పై.. జమ్మలమడుగు కోర్టు మేజిస్ట్రేట్ విచారణ జరిపింది. కడప జైలు నుంచి వర్చువల్​గా సునీల్ యాదవ్​ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాహుల్​ కేసు.. రెండు రోజుల పోలీసు కస్టడీకి కోగంటి సత్యం
    విజయవాడలో దారుణ హత్యకు గురైన యువ పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచారు. ప్రధాన నిందితుడు కోగంటి సత్యం కస్టడీ కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఇస్కాన్' వ్యవస్థాపకుడి స్మారకార్థం రూ.125 నాణెం విడుదల
    ప్రముఖ ఆధ్యాత్మిక సొసైటీ 'ఇస్కాన్' వ్యవస్థాపకులు స్వామి ప్రభుపాద 125వ జయంతి సందర్భంగా స్మారక నాణేన్ని విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. ప్రభుపాద స్థాపించిన ఇస్కాన్ మందిరాలు భారత సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సింపుల్ థింకింగ్ అలవాటుతోనే సమస్యలకు పరిష్కారం: కృష్ణా ఎల్లా
    తరగతి గదుల్లో కన్నా.. మానవ మస్తిష్కంలోనే ఆవిష్కరణలు ఉద్భవిస్తాయని.. ఊహా శక్తే వాటికి ప్రాణం పోస్తుందని భారత్ బయెటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా వివరించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్​మెంట్ 46వ ఫౌండేషన్ వేడుకల సందర్భంగా నిర్వహించిన లెక్చర్​లో కృష్ణా ఎల్లా కీలకపోన్యాసం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.ఋ
  • తాలిబన్లకు తలవంచని పంజ్‌షేర్‌!
    అఫ్గానిస్థాన్​లోని పంజ్​షేర్ ప్రాంతాన్ని హస్తగతం చేసుకునేందుకు తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. పంజ్​షేర్​ను గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ఆ ప్రాంత నేతలతో జరిపిన చర్చలు(panjshir taliban talks) విఫలమైనట్లు తాలిబన్ల ప్రతినిధి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • క్యూ1లో జీడీపీ 20 శాతం జంప్​- కొవిడ్​ నుంచి తేరుకున్నట్టేనా?
    కరోనా మొదటి దశలో విధించిన లాక్​డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో కుప్పకూలింది. అయితే రెండో దశలో మాత్రం పరిస్థితులు తారుమారయ్యాయి. 2021-22 క్యూ1లో 20.1 శాతం వృద్ధి రేటు(gdp growth rate) నమోదవ్వటమే ఇందుకు ఉదాహరణ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'కోహ్లీ తప్పు తెలుసుకో.. పంత్​ దూకుడుగా ఆడు'
    కోహ్లీ(virat kohli) వీలైనంత త్వరగా బ్యాటింగ్​లోని లోపాల్ని సరిదిద్దుకోవాలని సూచించాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్(vvs laxman). పంత్(rishabh pant) తన దూకుడైన ఆటతీరును కొనసాగించాలని తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తమిళనాడు సీఎంతో చిరంజీవి భేటీ
    తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​ను కలిసి అభినందించారు మెగాస్టార్​ చిరంజీవి(Chiranjeevi stalin). ఆయన​ రాజనీతిజ్ఞుడిగా ఎదుగుతున్నారని చిరు ప్రశంసించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.