ఏడాది కిందట మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల సంఘం తిరిగి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని కడప తెదేపా పార్లమెంటు అధ్యక్షులు లింగారెడ్డి డిమాండ్ చేశారు. కడప తెదేపా కార్యాలయంలో రానున్న మున్సిపల్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు అందరూ కొత్త నోటిఫికేషన్లు జారీ చేయాలని తీర్మానం చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో వైకాపా... అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపించారు. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరం, కడప ఉక్కు కర్మాగారం, రాజధాని తదితర విషయాలలో మోసపోయామన్నారు. ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. కావున ఇవన్నీ రాష్ట్రానికి దక్కాలంటే రానున్న ఎన్నికల్లో తెదేపాకు ఓటు వేయడమే మార్గమన్నారు.