ETV Bharat / city

పోలీసులే అభ్యర్థులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు: బీటెక్ రవి - పోలీసులే ఫోన్లు చేసి తెదేపా మద్దతుదార్లను బెదిరిస్తున్నారంటూ కడప ఎస్పీకి బీటెక్ రవి ఫిర్యాదు

పంచాయతీ ఎన్నికలు జరగనుండగా కడప జిల్లాలోని తమ మద్దతుదారులకు రక్షణ కల్పించాలంటూ.. ఎస్పీ అన్బురాజన్​ను తెదేపా నేతలు కోరినట్లు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పులివెందులలోని తమ పార్టీ తరపు అభ్యర్థులకు పోలీసులే ఫోన్లు చేసి ఎన్నికలకు దూరంగా ఉండాలని బెదిరిస్తున్నారంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి వెల్లడించారు.

kadapa tdp leaders met sp
కడప ఎస్పీని కలిసిన తెదేపా నేతలు
author img

By

Published : Feb 5, 2021, 4:32 PM IST

కడప జిల్లాలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి దౌర్జన్యాలు, బెదిరింపులు జరగకుండా తమ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని.. ఎస్పీ అన్బురాజన్​కు తెదేపా నేతలు విన్నవించారు. ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుంటే మరో పంచాయతీ నాయకులు ఆయా గ్రామాల్లో తిరగకుండా కట్టడి చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి కోరినట్లు తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని.. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాల మోహరింపును పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

పులివెందులలో తెదేపా మద్ధతుదారులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు పోలీసులే ఫోన్లు చేసి.. ఎన్నికలకు దూరంగా ఉండాలని బెదిరిస్తున్నారని ఎస్పీకి తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఫిర్యాదు చేశారు. జిల్లాలో గన్​మెన్​లున్న నాయకులపై షాడో బృందాలతో నిఘా పెట్టాలని కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎస్పీ చెప్పినట్లు తెదేపా నేతలు తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం కొన్నిచోట్ల ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు తప్ప.. తెదేపా పోటీ చేయడం లేదనేది వార్తలు వాస్తవం కావని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.20 లక్షలు ఇస్తా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.