రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రభుత్వ సలహాదారు రాజోలు వీరారెడ్డి.. అనుచరులతో వచ్చి తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని కడప జిల్లా పరిశ్రమల మేనేజర్ చాంద్బాషా ఆవేదన వ్యక్తం(Veera Reddy Outrage on Industries Manager Chand Bhasha) చేశారు. 'జనరల్ మేనేజర్ మన మాట వినడం లేదు. వీడిని వేసేస్తామంటూ తన అనుచరులకు చెప్పడం బాధాకరం' అని ఆయన మీడియా ఎదుట వాపోయారు. రాజోలు వీరారెడ్డి నిర్వహిస్తున్న పరిశ్రమ నిబంధనల ప్రకారం లేకపోవడంతో సబ్సిడీ ఇవ్వడం కుదరదని చెప్పడంతో తనను చంపేస్తానంటూ వేధింపులకు గురి చేస్తున్నారని (State Industries Department Government Advisers Veera Reddy Outrage) ఆయన పేర్కొన్నారు.
'రాజోలు వీరారెడ్డి అనుచరులు కృష్ణారెడ్డి బద్వేల్లో ఇటీవల ఓ పరిశ్రమను అమ్మారు. పరిశ్రమ అమ్మినట్లు తమకు సమాచారం లేదు. దీంతో ఆ పరిశ్రమకు ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వడం లేదు. ఈ క్రమంలో సబ్సిడీ ఎందుకు ఇవ్వడం లేదని.. రాజోలి వీరారెడ్డి, కృష్ణారెడ్డి మరికొంత మంది అనుచరులు ఆఫీస్కు వచ్చి బెదిరించారు. పరిశ్రమల జనరల్ మేనేజర్ మన మాట వినడంలేదు. సాయంత్రం 5 గంటలలోపు వీడిని వేసేయలంటూ రాజోలు వీరారెడ్డి అనడం సరైంది కాదు' అని చాంద్బాషా అన్నారు.
ఇదీ చదవండి..