Kadapa Rims Dental College: కడప రిమ్స్ దంత వైద్యకళాశాలలో ప్రిన్సిపల్ ఛాంబర్‌కు వైద్య సిబ్బంది సీల్ వేశారు. ప్రిన్సిపల్ సీటు కోసం సీనియర్, జూనియర్ దంత వైద్యుల మధ్య వివాదం కారణంగానే ఈ సీల్ వేసినట్లు తెలుస్తోంది. రిమ్స్ దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా సురేఖ ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. అయితే.. ఆమె ప్రిన్సిపల్‌గా రావడాన్ని.. ఇక్కడి దంత వైద్య కళాశాలలోని సీనియర్ వైద్యులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారులకు తెలియకుండా సిబ్బంది జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.
కాగా.. 10రోజుల క్రితం యుగంధర్ అనే వ్యక్తి ప్రిన్సిపల్‌గా వచ్చి బాధ్యతలు చేపట్టి, దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆయన తర్వాత సురేఖ రావడంతో మళ్లీ ఇక్కడ వ్యతిరేకత మొదలైంది. ప్రిన్సిపల్ ఛాంబర్‌కు సీల్ వేసిన ఘటనపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌లో కథనం ప్రసారం కావడంతో.. కళాశాల సిబ్బంది స్పందించారు. వెంటనే ఛాంబర్‌కు వేసిన సీల్‌ను తొలగించారు.
ఇదీ చదవండి: మంత్రి పదవి రాలేదు.. నా హింసావాదమేంటో చూపిస్తా : వైకాపా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు