కడప పోలీస్ స్పోర్ట్స్ మీట్కు ఎంతో చరిత్ర ఉందని జిల్లా ఎస్పీ అన్బురాజన్ వివరించారు. కడప పోలీస్ మైదానంలో శనివారం నుంచి సోమవారం వరకు జరగనున్న స్పోర్ట్స్ మీట్-2019ని ఎస్పీ ప్రారంభించారు. ఆరు సబ్ డివిజన్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 400 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్, హైజంప్, ఫుట్బాల్ తదితర పోటీలను నిర్వహిస్తున్నారు. గత పదేళ్ల నుంచి కడప జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామని ఎస్పీ చెప్పారు.
ఇదీ చదవండి