కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీపీపీ, కలమల్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐసీఎల్ సిమెంట్ కర్మాగారంలో పనిచేస్తున్న ఉద్యోగుల నివాసాల్లో గతేడాది డిసెంబర్లో రెండు భారీ చోరీలు జరిగాయి. లక్షల రూపాయలు విలువైన బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దొంగలు ఈ చోరీలు చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి, ఈ ఏడాది ఆగస్టులో మధ్యప్రదేశ్‌కు పంపించారు.
అక్కడ నెలరోజుల పాటు నిఘా ఉంచిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు కార్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్‌లో ఉన్న నలుగురిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని, మళ్లీ మధ్యప్రదేశ్ కు వెళ్లారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో బంగారు నగలను రికవరీ చేశారు. మొత్తం 360 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నామని, మరో ఇరువురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేయాల్సి ఉందని కడప డీఎస్పీ సునీల్ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను సన్మానించారు.
ఇదీచదవండి.