ETV Bharat / city

SOMASILA DAM IN KADAPA : సోమశిలతో దిగులు...వెనక జలాల్లో మునిగిన గ్రామాలు

Somasila dam back water in kadapa : కడప జిల్లా రాజంపేట మండలంలో వరద బీభత్సం నుంచి ప్రజలు కోలుకుంటుండగా... ఇదే జిల్లాలో మరో ప్రాంతం ముంపు సమస్యను ఎదుర్కొంటోంది. సోమశిల బ్యాక్​ వాటర్​ అనేక గ్రామాల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా ఇదే సమస్య ఉత్పన్నమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోమశిల ప్రాజెక్టు
సోమశిల ప్రాజెక్టు
author img

By

Published : Dec 12, 2021, 9:34 AM IST

సోమశిల ప్రాజెక్టు

Somasila dam back water in kadapa : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెన్నానది ఉద్ధృతంగా ప్రవహించింది. ఆ నీరంతా నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టుకు చేరింది. సోమశిల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరడంతో ప్రాజెక్టు వెనక జలాలు కడప జిల్లాలోని గ్రామాలను చుట్టుముట్టాయి. ఒంటిమిట్ట, సిద్ధవటం, అట్లూరు, పెనగలూరు, గోపవరం మండలాల్లోని 105 గ్రామాలు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో దుర్వాసనతో పాటు విషపురుగులు వస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు.

నిలిచిన రాకపోకలు...

గంగపేరూరు, పెన్నపేరూరు గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. పెన్నపేరూరు-వెంకటాయపల్లె రహదారి పైకి నీళ్లు రావడంతో రాకపోకలు నిలిచి పోయాయి. అట్లూరు మండలంలో సగిలేరుపై నిర్మించిన వంతెన సోమశిల వెనకజలాలతో నీటమునిగింది. ముత్తుకూరు, వేమలూరు, కామసముద్రం, మాడపూరు, మన్నెంవారిపల్లె, కమలకూరు గ్రామస్థులు మండల కేంద్రం అట్లూరుకు రావాలంటే చుట్టూ 45 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తోంది.

అధికారుల కాలయాపన...

Somasila dam back water in kadapa : సోమశిల వెనక జలాల సమస్య ఏటా వర్షాకాలంతో తలెత్తుతున్నా పరిష్కారం చూపడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోందని విమర్శలు వస్తున్నాయి. ముంపువాసులకు పరిహారం చెల్లిస్తే.. గ్రామాలు ఖాళీ చేసే వీలున్నా ఇంకా సర్వేలు, విచారణ పేరుతోనే అధికారులు కాలయాపన చేస్తున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.