రాష్ట్ర ఎన్నికల సంఘం హడావుడిగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. ఏ మాత్రం తీరిక లేకుండా మార్చి నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించడానికి కారణం ఏంటని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందే ఎన్నికల తేదీలు ఖరారు చేస్తే... వాటినే ఎన్నికల సంఘం ప్రకటించిందని ఆయన కడపలో వ్యాఖ్యానించారు.
తాము సిద్ధం...
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని... కానీ ఎన్నికలు నిర్వహించే విధానమే సరిగా లేదని ఆయన అన్నారు. రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని పలువురు ఆరోపిస్తున్నా పట్టించుకోని ఎన్నికల సంఘం...ఎందుకు హడావుడి ప్రకటనలు చేసిందో అర్థం కావడం లేదన్నారు. మూడు నెలల కిందట ఎన్నికలు నిర్వహించి ఉంటే ఎవరూ ప్రశ్నించే వారు కాదన్న శైలజానాథ్... బీసీలకు న్యాయం చేయడానికి ఎందుకు సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్లలేదని నిలదీశారు. ఈ నెలఖారులోగా ఎన్నికలు నిర్వహించకపోతే 5 వేల కోట్ల రూపాయల కేంద్రం నిధులు రావనే సాకును రాష్ట్ర మంత్రులు చెప్పటం సిగ్గు చేటన్నారు. ఎన్నికల్లో 90 శాతం ఫలితాలు అనుకూలంగా రాకపోతే మంత్రులు రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం దేనికి సంకేతమని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి..మహిళలూ తెలుసుకోండి... ఈ చట్టాలు మీకోసమే..