ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని.. ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమల తిరుపతి తొలి గడప అయిన.. దేవుని కడపలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముస్లిం సోదరులు దర్శించి ప్రార్థనలు నిర్వహించారు. బీబీ నాంచారమ్మ తమ ఆడబిడ్డగా భావించి.. ముస్లిం సోదరులు ప్రార్థనలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. శుభ కృత నామ ఉగాది సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం ముత్యాలమ్మ పేటలో.. అమ్మవారి ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మ వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఇదీ చదవండి: Ugadi celebrations at TTD: తిరుమలలో ఉగాది వేడుకలు.. ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహణ