కడపకు చెందిన అన్నదమ్ములు జిలానీ బాష, మహబూబ్ బాషా... ఏం ఆశించకుండా ప్రతిరోజూ పేదల కడుపునింపుతున్నారు. ఇటీవలి కాలంలో వైకాపా ప్రభుత్వం అన్న క్యాంటీన్లు రద్దు చేయటంతో కడప పట్టణంలో ఎంతోమంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని.... వీరిద్దరూ ఉచిత అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని పాతరిమ్స్ కూడలి వద్ద ప్రతిరోజూ మధ్యాహ్నం 12:30 గంటలకు అన్నదానం చేస్తున్నారు. రెండు నెలలుగా రోజుకూ 150 నుంచి 200 మంది కడుపు నింపుతున్నారు. ఈ ప్రాంతంలో ఆసుపత్రిలో చాలా ఉన్నాయి. ఎంతో మంది రోగులు వస్తుంటారు. అలాంటి వారికి ఈ ఉచిత అన్నదానం ఎంతో ఉపయోగపడుతోంది. ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రతిరోజు 3 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాతల సహకారంతో ఈ సోదరులు అన్నదానం నిర్వహిస్తున్నారు. భోజనం చేసిన వారందరూ చాలా బాగుందని వారిని అభినందిస్తున్నారు.
ఆకలితో ఉన్నవారికి.... ఈ సోదరులు అన్నం పెడతారు! - కడప తాజా వార్తలు
సాయం చేయడానికి కులం, మతం చూడాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు ఆ సోదరులు. రెండు నెలల నుంచి పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆకలితో వచ్చిన వారందరికీ కడుపునిండా భోజనం పెట్టి సంతోషంగా పంపిస్తున్నారు.

ఇదీ చదవండి