వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి ప్రమేయం లేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. అవినాష్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని ఛాలెంజ్ విసిరారు. తనతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తారని చెప్పుకొచ్చారు. వివేకా హత్యకేసులో అవినాష్‌రెడ్డిని హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
ఎర్ర గంగిరెడ్డి మరో ముగ్గురితో కలిసి వివేకా హత్యకు పథకం చేశారని రాచమల్లు చెప్పారు. డబ్బులు ఇవ్వలేదనే కోపంతోనే గంగిరెడ్డి హత్యకు పాల్పడినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినా సీబీఐ ఎందుకు అరెస్ట్ చేయలేదని.. హంతకుడిని సాక్షిగా మార్చమని సీబీఐ కోరుతోందని ఆరోపించారు.
ఇదీ చదవండి:
ARREST: మారు తాళాలతో బంధువు ఇంట్లో చోరీ.. ఆ తరువాత ఏమైందంటే..