కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నల్లపురెడ్డిపల్లిలో జరిగిన కాల్పులకు ఆస్తి తగాదాలే కారణమని ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు. రెండు కుటుంబాల మధ్య ఎప్పటినుంచో వ్యక్తిగత కక్షలున్నట్లు తెలిపారు. ప్రసాద్ రెడ్డి ఇంటిపైకి పార్థసారధి రెడ్డి కత్తి తీసుకొని వచ్చి దాడికి యత్నించారన్నారు. భయంతో ప్రసాద్ రెడ్డి తన వద్ద ఉన్న లైసెన్స్ తుపాకీతో పార్థసారధిరెడ్డిపై కాల్పులు జరిపారని వివరించారు. పార్థసారధిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. తర్వాత అదే తుపాకీతో ప్రసాద్‌రెడ్డి కాల్చుకొని చనిపోయాడన్నారు. వారిద్దరి మధ్య వ్యక్తిగత కారణాలూ ఉన్నట్లు విచారణలో తెలిసిందన్నారు. రెండు మృతదేహాలకు శవపంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు.
అనుబంధ కథనం:
Firing: కాల్చి చంపాడు.. తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు!