నివర్ ప్రభావంతో కురిసిన వర్షాలతో కడప నగరం అతలాకుతలం అయ్యింది. వానలు తగ్గి 4 రోజులు అయినప్పటికీ అక్కడి ప్రజల కష్టాలు ఇంకా తీరలేదు. ఇళ్లలోకి వచ్చిన నీరు, తడిసిన సామగ్రితో ఇబ్బందులు పడుతున్నారు. వాటికితోడు చెత్తాచెదారం, దుర్వాసనతో వ్యాధులు ప్రబలుతాయని జనం భయపడుతున్నారు. తాగునీరు, ఆహారం లేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటివరకు ఏ అధికారి తమను పరామర్శించలేదని.. తమ గోడు పట్టించుకోవట్లేదని వాపోయారు.
ఇవీ చదవండి..