మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా.. ఆయన బోధనలు ప్రజల్లోకి తీసుకువెళ్తామని 'జమాతే ఇస్లామీ హింద్' రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ సుబహన్ తెలిపారు. ఈనెల 31వ తేదీ నుంచి వారంపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కడపలోని ఆ సంస్థ కార్యలయంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రవక్త బోధనలకు అనుగుణంగా దేశంలో పాలన జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
దేశంలోని బడుగు, బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయని సుబహన్ ఆరోపించారు. రోజురోజుకు దళితులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. ఇటువంటి క్లిష్ట సమయాల్లో సమాజంలో మార్పు తీసుకురావడానికి.. మహమ్మద్ బోధనలు అవసరమని అభిప్రాయపడ్డారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: సిమెంట్ కంపెనీ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ