వైఎస్ వివేకా హత్య కేసులో 95వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ అధికారులు భరత్‌కుమార్ యాదవ్‌ను విచారిస్తున్నారు. పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ బంధువు.. భరత్ కుమార్, సుంకేశులకు చెందిన ఉమాశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. భరత్‌కుమార్, ఉమాశంకర్‌రెడ్డిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. భరత్, ఉమాశంకర్ నుంచి కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: VIVEKA MURDER CASE: విచారణకు హాజరైన వివేకా సోదరుడు