మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (viveka murder case) సీబీఐ విచారణ 114వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి సీబీఐ విచారణకు హాజరయ్యారు. దస్తగిరిని సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందుల తీసుకెళ్లారు. ఇప్పటికే పలుమార్లు దస్తగిరిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా హత్య జరగడానికి ఆరు నెలల ముందు దస్తగిరి పని మానేశాడు. అతను ఇచ్చిన కొన్ని కీలక ఆధారాలతో సీబీఐ అధికారులు పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.
కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం..!
నెలరోజుల కిందటే ప్రొద్దుటూరు కోర్టులో 164 సెక్షన్ కింద దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్య జరిగిన సమయంలో ఇంటివద్ద దస్తగిరి ఉన్నట్లు సీబీఐ భావిస్తోంది. దస్తగిరిని సాక్షిగా వాంగ్మూలం నమోదు చేయించిన సీబీఐ అధికారులు.. నేర స్థలంలో ఉన్నారనే సమాచారంతో అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో దస్తగిరిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: