కర్నూలు, కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో కుందూ నది ఉధృతి పెరిగింది. మూడు రోజుల కిందట పదకొండు వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా.. రెండు రోజుల్లో మూడింతలు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీశైలం జలాశయం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి విడుదల చేసిన నీటితోపాటు వర్షపు నీరు తోడై కుందూ నది పూర్తి స్థాయి నీటి మట్టంతో ప్రవహిస్తోంది. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. పెన్నాలో కలుస్తున్న నీటితో.. జలాశయాలు కళకళలాడుతున్నాయి.
ఇవీ చూడండి: