ETV Bharat / city

'రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి'

కడప తెదేపా పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం న్యాయవ్యవస్థపై తప్పుడు ప్రచారం చేస్తోందని తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి విమర్శించారు.

gandhi-jayanti-was-celebrated-at-the-kadapa-tdp-party-office
తెదేపా నేతలు
author img

By

Published : Oct 2, 2020, 3:35 PM IST

రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు పూర్తిగా విఫలమైన నేపథ్యంలో.. రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఏర్పడిందని తెదేపా కడప పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి డిమాండ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా కడప పార్టీ కార్యాలయంలో గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కడప, రాజంపేట పార్లమెంటు పార్టీ అధ్యక్షులు లింగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డితోపాటు కడప మహిళ అధ్యక్షురాలు శ్వేతాశ్రీ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

కేంద్రం పట్టించుకోవాలి..

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే విధంగా మీడియా, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తోందని లింగారెడ్డి గుర్తు చేశారు. న్యాయస్థానమే న్యాయాన్ని కాపాడుకునేందుకు హైకోర్టులో పిటిషన్లు వేయాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. జరుగుతున్న పరిణామాలు, దాడులు చూస్తుంటే ...రాష్ట్రంలో అంతర్యుద్దం వచ్చే ప్రమాదం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో కేంద్రం పరిశీలించాలన్నారు.

జిల్లాలో కడప, రాజంపేట పార్లమెంటులకు ఎన్నడూ లేని విధంగా పార్టీ అధ్యక్షుల నియామకాలను పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహిళా కార్యకర్తలను ఎక్కువమందిని పార్టీలో చురుగ్గా పాల్గొనే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తానని నూతన తెదేపా కడప పార్లమెంటు అధ్యక్షురాలు శ్వేతా శ్రీ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: 'న్యాయవ్యవస్థపై విశ్వాసం లేకపోతే హైకోర్టును మూసేయమనండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.