ETV Bharat / city

కడప ఉక్కు భాగస్వామికి ఆర్థిక కష్టాలు - కడపలో ఉక్కు పరిశ్రమ

కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం భాగస్వామిగా ఎంపిక చేసుకున్న లిబర్టీ స్టీల్స్ ఆర్ధిక ఇబ్బందులు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు బ్రిటన్ ప్రభుత్వాన్ని సాయం కోరినా.. ఆ దేశ ప్రభుత్వం తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో వేల కోట్ల పెట్టుబడి పెట్టి కర్మాగారం నిర్మిస్తుందా అన్న సందేహం తలెత్తుతోంది.

financial troubles for liberty steel limited
kadapa steel plant
author img

By

Published : Mar 30, 2021, 5:14 AM IST

కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఎంపిక చేసుకున్న లిబర్టీ స్టీల్స్‌ ఆర్థిక ఇబ్బందులు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. దీంతో ఈ కంపెనీ ఏపీలో కర్మాగారం నిర్మించడం సమీప భవిష్యత్తులో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. బ్రిటన్‌ కేంద్రంగా పనిచేసే లిబర్టీ స్టీల్స్‌ మాతృసంస్థ అయిన ‘గుప్తా ఫ్యామిలీ గ్రూప్‌ (జీఎఫ్‌జీ) అలయెన్స్‌’కు ప్రధాన రుణదాత అయిన ‘గ్రీన్‌సిల్‌ కేపిటల్‌’ మూడు వారాల కిందట దివాలా తీసింది. అప్పటి నుంచి లిబర్టీ భవిష్యత్తుపై బ్రిటన్‌లో చర్చ జరుగుతోంది. తనకు 30వేల కోట్లకుపైగా బకాయి ఉన్న జీఎఫ్‌జీ అలయెన్స్‌ నుంచి చెల్లింపులు ఆగిపోవడం గ్రీన్‌సిల్‌ దివాలాకు ప్రధాన కారణాల్లో ఒకటి. బ్రిటన్‌లోని తమ కర్మాగారాల రోజువారీ నిర్వహణ ఖర్చులు, ఇటీవలి నష్టాలను భర్తీ చేసుకోవడం కోసం 170మిలియన్‌ పౌండ్లను (దాదాపు రూ.1700 కోట్లకుపైగా) సాయంగా ఇవ్వాలని లిబర్టీ స్టీల్స్‌ అధినేత సంజీవ్‌ గుప్తా చేసిన విజ్ఞప్తిని ఆ దేశ ప్రభుత్వం తిరస్కరించినట్లు బీబీసీ వార్తా సంస్థ తాజాగా ఒక కథనాన్ని వెలువరించింది.

బ్రిటన్‌లో ఉన్న కర్మాగారాల రోజువారీ ఖర్చుల కోసం కూడా అక్కడి ప్రభుత్వాన్ని సాయం అడిగేంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న లిబర్టీ స్టీల్స్‌ కడపలో కర్మాగారం పెట్టడం సాధ్యం కాదని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కడపలో నిర్మించతలపెట్టిన ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 2019 డిసెంబరు 23న శంకుస్థాపన చేశారు. కర్మాగారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేసింది. జమ్మలమడుగు మండలంలో 3,148 ఎకరాల భూమిని కేటాయించింది. ఇనుప ఖనిజం సరఫరాకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఎండీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ‘రాయలసీమ ఆర్థిక, ఉద్యోగాల చరిత్రను మార్చేందుకు 30 లక్షల టన్నుల సామర్థ్యంతో దీనికి శంకుస్థాపన చేస్తున్నామని గర్వంగా చెబుతున్నాన’ని ఆ సభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పనులు ప్రారంభిస్తూనే మరోవైపు పెద్ద కంపెనీలతో చర్చలు జరుపుతోందని, ఆ చర్చలు కొలిక్కివచ్చే వరకూ ఆగకూడదన్న ఉద్దేశంతోనే మనమే ముందడుగు వేశామని ఆయన చెప్పారు. మధ్యలో ఎవరైనా వస్తే సరి.. లేకపోతే ప్రభుత్వమే ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తుందని ప్రకటించారు. కర్మాగార నిర్మాణ భాగస్వామిగా ఉండేందుకు ఏడు ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ప్రభుత్వ వర్గాలు పలు సందర్భాల్లో పేర్కొన్నాయి. ఇలా ముందుకొచ్చిన కంపెనీల్లో ఎస్‌బీఐ క్యాప్‌ సిఫారసు మేరకు లిబర్టీ స్టీల్స్‌ను ఎంపిక చేసినట్లు గత నెల 23న ప్రభుత్వం ప్రకటించింది. కర్మాగారం నిర్మాణానికి ఈ కంపెనీ తొలిదశలో రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లిబర్టీ స్టీల్స్‌కు అది సాధ్యమయ్యేలా లేదు.

అవసరమైతే ఎస్సార్‌ స్టీల్స్‌ను సంప్రదిస్తాం: మంత్రి గౌతమ్‌రెడ్డి
లిబర్టీ స్టీల్స్‌ వ్యవహారాలపై బ్రిటన్‌లోని భారత్‌ రాయబార కార్యాలయం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు. కడపలో ఉక్కు కర్మాగార నిర్మాణానికి ఎస్సార్‌ స్టీల్స్‌ సంస్థ కూడా సిద్ధంగా ఉందన్నారు. అవసరమైతే దానితో సంప్రదించి ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. నిర్ణీత వ్యవధిలో కర్మాగార నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్నారు.

బ్రిటన్‌ ఆదుకుంటుందా?
లిబర్టీ స్టీల్స్‌కు బ్రిటన్‌లో 12చోట్ల ఉక్కు, అల్యూమినియం కర్మాగారాలు ఉన్నాయి. ఇందులో దాదాపు మూడు వేల మంది పనిచేస్తున్నారు. ఆ గ్రూపులోని ఇతర సంస్థల్లో మరో రెండువేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఇబ్బంది తలెత్తకుండా లిబర్టీ వ్యాపారాలను నిలబెట్టడంపై అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నట్లు ఇటీవల బ్రిటన్‌ ప్రధాని ప్రకటించారు. సంజీవ్‌ గుప్తా విజ్ఞప్తిని బ్రిటన్‌ తిరస్కరించడంపై ఆ ప్రభుత్వ వర్గాలను సంప్రదించినప్పుడు పారదర్శకంగా కనిపించని గుప్తా వ్యాపార సామ్రాజ్య స్వభావంపై తమకు ఆందోళన ఉందని తెలిపినట్లు బీబీసీ తన కథనంలో పేర్కొంది. ‘లిబర్టీ స్టీల్స్‌ ఆర్థిక నిర్వహణ, గ్రీన్‌సిల్‌ సంస్థ కుప్పకూలడంలో దాని పాత్రకు సంబంధించిన అంశాలు చాలా సంక్లిష్టమైనవి. అందువల్ల ప్రస్తుత నిర్ణయాన్ని చూసి ఆశ్చర్యపడనక్కర్లేదు. అయితే స్థానిక స్టీల్‌ పరిశ్రమను కాపాడేందుకు.. ప్లాన్‌ ‘బి’ కింద ఏదైనా సాయం చేయాల్సి ఉంది’ అని ఆ వర్గాలు పేర్కొన్నట్లు బీబీసీ తెలిపింది. బ్రిటన్‌ ప్రభుత్వం రెండేళ్ల కిందట సంక్షోభంలో కూరుకుపోయిన ‘బ్రిటీష్‌ స్టీల్స్‌’ అనే సంస్థను కూడా ఆదుకుంది. దానికి చేయూతను ఇచ్చే ముందు ఆ సంస్థ నిర్వహణ బాధ్యతను ఒక ప్రభుత్వ అధికారి చేతుల్లో పెట్టింది. లిబర్టీ విషయంలోనూ బ్రిటన్‌ ప్రభుత్వం ఇలాంటి ఆలోచనే చేస్తున్నట్లుగా అక్కడి పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.

ఇదీ చదవండి

సరికొత్తగా అంగన్‌వాడీ భవనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.