ETV Bharat / city

FARMERS PROTEST: 'విక్రయించిన ధాన్యం సొమ్ములు ఇప్పించండి' - కడప జిల్లాలో రైతుల నిరసన

గోడౌన్​(godown)లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని, తమకు తెలియకుండా విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తి నుంచి.. సొత్తు వ‌సూలు చేయిస్తామ‌న్న పోలీసులు(police) తొమ్మిది నెల‌లైనా ప‌ట్టించుకోవ‌డంలేద‌ని రైతులు ఆందోళ‌న(protest) వ్య‌క్తం చేశారు. క‌డ‌ప జిల్లా రాజుపాలెం మండ‌లం శెట్టిప‌ల్లె(shettipalle) గ్రామానికి చెందిన రైతుల ధాన్యం చోరీకి గురైంది. ఈ ఘటనపై బాధితులు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా... జిల్లా ఎస్పీ ఆదేశాల మేర‌కు పంచాయితీ చేసి, గోడౌన్ య‌జ‌మాని నుంచి ప్రాంసరి నోట్లు(promissory note) రాయించినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయిందని బాధిత రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కడప జిల్లా రాజుపాలెంలో రైతుల ఆందోళన
కడప జిల్లా రాజుపాలెంలో రైతుల ఆందోళన
author img

By

Published : Oct 5, 2021, 9:16 PM IST

కడప జిల్లా రాజుపాలెం మండ‌లంలోని విజ‌యదుర్గ గోడౌన్‌(vijayadurga godown)లో సుమారు రూ.7 కోట్లు విలువైన శనగలు, ధనియాలను నిల్వ ఉంచారు. గిట్టుబాటు ధ‌ర వ‌చ్చిన‌ప్పుడు విక్ర‌యించుకోవ‌చ్చన్న తలంపుతో రైతులు గోడౌన్​లో భద్రపరిచారు. ఈ క్రమంలో రైతుల‌కు తెలియ‌కుండా ఆ గోదాం య‌జ‌మాని భ‌ర‌త్ కుమార్‌రెడ్డి... ధాన్యాన్ని(grain) విక్ర‌యించి సొమ్ము చేసుకున్నారు. విష‌యాన్ని ఆల‌స్యంగా తెలుసుకున్న రైతులు గ‌తేడాది డిసెంబ‌రులో ఆందోళన నిర్వ‌హించారు. బాధితుల నిరసనతో... సమస్యను ప‌రిష్క‌రిస్తామ‌ని రాజుపాలెం పోలీసులు సయోధ్య(understanding) కుదిర్చారు. గోదాంలో దాచిన ధాన్యం తాలూకు ర‌శీదు(pay slip), ఇత‌ర ప‌త్రాల‌(documents)ను తీసుకుని య‌జ‌మాని భ‌ర‌త్ రెడ్డి విక్ర‌యించిన ధాన్యంకు బ‌దులు న‌గదు చెల్లించేలా పంచాయితీ చేశారు. ఆరు నెలల్లో రైతుల‌కు ఇవ్వాల్సిన డ‌బ్బును చెల్లిస్తామని బాండ్లు(bonds) రాయించారు. ఈ పరిణామాల నడుమ గోడౌన్ యజమాని భరత్ కుమార్ రెడ్డి ఆత్మహత్య(suicide) చేసుకున్నారు.

డబ్బులు చెల్లించ‌డంలో అలసత్వం...

ఇది జరిగి తొమ్మిది నెల‌లు గడుస్తున్నా... డబ్బులు చెల్లించ‌డంలో అలసత్వం(delay) వహిస్తున్నారని బాధిత రైతులు ఆందోళన చేశారు. ప‌లుమార్లు పోలీస్టేష‌న్​కు వెళ్లినా స‌రైన స‌మాధానం రాక‌పోవ‌డంతో గోదాం య‌జ‌మాని ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళ‌న చేశారు. అయినా ఒక్క‌ రూపాయీ చెల్లించలేదని మండిపడ్డారు. రైతుల‌ను మోసం చేశారంటూ భార‌తీయ కిసాన్ సంఘ్ నేతలు(bharathiya kisan sangh leaders) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా క‌లెక్ట‌ర్ జోక్యం చేసుకుని, చట్టపరమైన చర్యలు తీసుకుని, గోడౌన్ యజమాని ఆస్తులను జ‌ప్తు చేసి, రైతుల‌ను ఆదుకోవాల‌ని కోరారు. ప్ర‌భుత్వం, జిల్లా కలెక్ట‌ర్ స్పందించ‌క‌పోతే గోదాము య‌జ‌మాని భ‌ర‌త్ కుమార్‌రెడ్డి త‌ర‌హాలోనే బాధిత రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవాల్సిన దుస్థితి వస్తుందని భార‌తీయ కిసాన్ సంఘ్ నాయ‌కులు హెచ్చరించారు(warning).

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం....

రైతుల ఆందోళ‌న‌కు ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టి ఇన్‌ఛార్జీ జీవి ప్ర‌వీణ్ కుమార్‌రెడ్డి,(TDP prodduturu incharge GV.Praveen kumar) ఇత‌ర రాష్ట్ర నేత‌లు మ‌ద్ద‌తు తెలిపారు. రైతుల‌కు అన్యాయం జ‌రిగిన విష‌యంలో ప్ర‌భుత్వ పెద్ద‌లు, స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధిత రైతుల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు తెదేపా అండగా ఉంటుందని జీవీ ప్ర‌వీణ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. బాధిత రైతులు, భార‌తీయ కిసాన్‌సంఘ్ నాయ‌కులు ఇచ్చిన విన‌తిప‌త్రంపై రాజుపాలెం తహ‌సీల్దార్ మాబూచాంద్(rajupalem MRO mabuchandh) స్పందించారు. విజ‌య‌దుర్గ గోదాం బాధిత రైతుల పూర్తి వివ‌రాలు సేక‌రించి, న్యాయం జ‌రిగేలా జిల్లా క‌లెక్ట‌ర్ దృష్టికి, జేసీ దృష్టికి తీసుకెళ‌తామ‌ని హామీ ఇచ్చారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.