విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కార్మికులతో పాటు ఇతర ఉద్యోగ సంఘాలు ఉద్యమం చేపడతామని.. కడప విద్యుత్ ఉద్యోగుల సంఘం ఐకాస నాయకులు నాగ సుబ్బారెడ్డి అన్నారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ కడప విద్యుత్ భవన్ ఎదుట ఉద్యోగులు నిరసన దీక్షలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తోన్న విద్యుత్తును ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజాధనం లూటీ చేసినట్లు అవుతుందని ఆరోపించారు. ప్రైవేటీకరణ వల్ల విద్యుత్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నాణ్యమైన విద్యుత్తు సరఫరా కాదని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని నాగ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి