ETV Bharat / city

'స్కాముల అమరావతిలో రాజధాని కొనసాగించాలా..?' - అంజద్ బాష్ అమరావతిపై వ్యాఖ్యలు

చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. అమరావతిలో కొన్ని వేల ఎకరాలు ఇన్​సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు.

amzad basha
'స్కాముల అమరావతిలో రాజధాని కొనసాగించాలా?'
author img

By

Published : Feb 25, 2020, 8:16 PM IST

'స్కాముల అమరావతిలో రాజధాని కొనసాగించాలా?'

గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో 4 వేల 70 ఎకరాల ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా ఆరోపించారు. అవినీతిమయమైన ప్రాంతంలో రాజధాని కొనసాగించాల్సిన అవసరముందా అంటూ ప్రశ్నించారు. వివిధ రాష్ట్రాల్లో పాలనా సౌలభ్యం కోసం ఒకటి కంటే ఎక్కువ రాజధానులు ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. చంద్రబాబు మాత్రం తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతే రాజధానిగా ఉండాలంటూ పోరాటం చేస్తున్నారని అంజాద్‌బాషా విమర్శించారు. రాష్ట్రంలో మూడు రాజధానులను అనేక మంది స్వాగతిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి:

అది జగనన్న వసతి దీవెన కాదు.. వంచన దీవెన: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.