అనంతపురం జిల్లాలో..
క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఇద్దరు గ్రామ వాలంటీర్లు, ఓ రైల్వే కానిస్టేబుల్ సహా 24 మందిని అనంతపురం జిల్లా గుడిబండ పోలీసులు అరెస్టు చేశారు. వీరందరూ గుడిబండ జూనియర్ కళాశాల ముందు సీసీ గిరి గ్రామంలోని పాఠశాల వద్ద క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని డీఎస్పీ మహబూబ్ బాషా వివరించారు. నిందితుల నుంచి 23 మెుబైల్ ఫోన్లు, 79 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్య క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసిన ఎస్సైలను డీఎస్పీ అభినందించారు.
కడప జిల్లాలో..
కడప జిల్లా వేముల మండలంలో జూనియర్ కాలేజీ ప్రాంగణంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగుర్ని అరెస్టు చేసినట్లు ఎస్సై సంజీవరెడ్డి వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే ముందస్తు సమాచారంతో దాడులు చేసినట్లు వివరించారు. పట్టుబడిన ఆరుగురు నిందితుల నుంచి 85 వేల నగదు 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
కడప అక్కయ్య పల్లెలోని అక్కదేవతల గుడి సమీపంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగుర్ని అరెస్టు చేసినట్లు కడప తాలూకా సీఐ నాగభూషణం తెలిపారు. నిందితుల నుంచి 70 వేల నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ పోటీలు ముగిసే వరకు నిఘా కట్టుదిట్టం చేశామనీ.. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే వారిని జిల్లా బహిష్కరణ చేస్తామని సీఐ హెచ్చరించారు.
ఇదీ చదవండి: