రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజు రద్దు చేయాలని.. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారాయణ డిమాండ్ చేశారు. కడప పాత బస్టాండ్లోని పూలే విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జాతీయ రహదారులతో పాటు సాధారణ రాష్ట్ర రహదారులపైనా టోల్ ఫీజు వసూలు చేయడం దారుణమని నారాయణ పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. అన్ని రూపాల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. తక్షణం ఆ రుసుముల వసూలును రద్దు చేయకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'ధర్నాలు చేయాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి'