ETV Bharat / city

రజతోత్సవాలకు ముస్తాబవుతున్న సీపీ బ్రౌన్ గ్రంథాలయం - CP Brown library latest news

తెలుగు భాషాభివృద్ధి కోసం విశేష కృషి చేసిన సీపీ బ్రౌన్ పేరుతో కడపలో స్థాపించిన సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి పాతికేళ్లు నిండాయి. నవంబరు 29న రజతోత్సవాలు జరుపుకుంటున్న గ్రంథాలయం... నాటి మధుర స్మృతులను సాహితీవేత్తలు, భాషాభిమానులు నెమరు వేసుకుంటున్నారు. 70 వేల పుస్తకాలు, 250 పైగానే తాళపత్ర గ్రంథాలతో భాషా పరిశోధన కేంద్రం భాసిల్లుతోంది. 25 ఏళ్లలో గ్రంథాలయం సాధించిన ప్రగతి, ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిద్దాం.

CP Brown library silver jublee celebrations in Kadapa
రజతోత్సవాలకు ముస్తాబవుతున్న సీపీ బ్రౌన్ గ్రంథాలయం
author img

By

Published : Oct 8, 2020, 6:03 PM IST

1820లో ఈస్ట్ఇండియా కంపెనీ ఉద్యోగిగా కడప కలెక్టర్​కు రెండో సహాయకుడిగా పనిచేసిన చార్లెస్ పిలిప్ బ్రౌన్... నాడు తెలుగు భాష కోసం విశేషంగా కృషి చేశారు. కడపలో 15 ఎకరాల మామిడితోట, ఓ బంగ్లాను అప్పట్లో 3 వేల వరహాలకు కొనుగోలు చేసిన సీపీ బ్రౌన్... అక్కడ బ్రౌన్ కళాశాల ఏర్పాటు చేశారు. తెలుగు భాష కోసం అధ్యయనం చేశారు. సీపీ బ్రౌన్ లండన్ వెళ్లే ముందు ఆయన నివాసమున్న భవవాన్ని కడప జిల్లాకు చెందిన సంపత్ కుమార్ అనే వ్యక్తికి 15 ఎకరాల తోటను, బంగళాను 4 వేల వరహాలకు విక్రయించి వెళ్లాడు.

తెలుగు భాష కోసం కృషి చేసిన సీపీ బ్రౌన్ పేరుతో ఆయన నివసించిన ప్రదేశంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 1976లో ప్రముఖ సాహితీ వెత్తలైన డాక్టర్ ఆరుద్ర, ఆచార్య జీఎన్ రెడ్డి, బంగోరే, కేతు విశ్వనాథ్ రెడ్డి బృందం కడపలో పర్యటించింది. కడప ఎర్రముక్కపల్లె సమీపంలో శిథిలావస్థలో ఉన్న భవంతిని గుర్తించారు. ఇక్కడే గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నాటి కలెక్టర్ పీఎస్ సంజీవరెడ్డి చొరవతో స్థలం కొనుగోలు చేసిన సంపత్ కుమార్ అనే వ్యక్తితో చర్చలు జరిపారు.

కలెక్టర్ సూచన మేరకు సంపత్ కుమార్ అనే వ్యక్తి గ్రంథాలయ స్థాపన కోసం 20 సెంట్ల స్థలాన్ని విరాళంగా అందజేశారు. అంతే గ్రంథాలయాన్ని నిర్మించే బాధ్యతను కడపకు చెందిన ప్రముఖ రచయిత జానమద్ధి హనుమచ్ఛాస్త్రికి అప్పగించారు. ట్రస్టు ఆద్వర్యంలో సీపీ బ్రౌన్ గ్రంథాలయం ఏర్పాటైంది. జానమద్ధి వివిధ ప్రాంతాలు తిరిగి పుస్తకాలు, విరాళాలు సేకరించి గ్రంథాలయం నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించారు.

1987 జనవరి 22న సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి అప్పటి అధికారులు శంకుస్థాపన చేయగా... 1995 నవంబరు 29న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవం జరిగింది. ఫలితంగానే నేటికి సీపీ బ్రౌన్ గ్రంథాలయం 25 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో వచ్చేనెల 29, 30 తేదీల్లో రజతోత్సవాలు నిర్వహించనున్నారు. గ్రంథాలయం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ప్రముఖ సాహితీవేత్త కేతు విశ్వనాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

1995 నుంచి మొదటి అంతస్తులో గ్రంథాలయం కేంద్రంగా ట్రస్టు ఆద్వర్యంలో విరాళాలతో నడుస్తోంది. అప్పటి ఎంపీ సి.నారాయణరెడ్డి 10 లక్షల రూపాయల ఎంపీ ల్యాడ్స్ నిధులు ఇవ్వడంతో రెండో అంతస్తుకు ఆయన పేరు పెట్టారు. 2005 జనవరి 27న అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎం హోదాలో గ్రంథాలయాన్ని సందర్శించారు. ఏమి కావాలని ట్రస్టు నిర్వహణ చూస్తున్న జానమద్ధి హనుమచ్ఛాస్త్రిని రాజశేఖర్ రెడ్డి అడిగితే... గ్రంథాలయాన్ని ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. అంతే నెలరోజుల్లోపే ట్రస్టు వార్షిక బడ్జెట్ 15 లక్షల రూపాయలుగా మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీపీ బ్రౌన్ గ్రంథాలయాన్ని నడిపే బాధ్యతను తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అప్పగించారు.

2005 నవంబరు 30న ట్రస్టును రద్దు చేస్తూ... ట్రస్టు సేకరించిన 22 లక్షల రూపాయలు, 30 వేల పుస్తకాలను విశ్వవిద్యాలయానికి అప్పగించారు. 2006 మే నెలలో కడపలో యోగివేమన విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. దీంతో తిరుపతి విశ్వవిద్యాలయం నుంచి సీపీ బ్రౌన్ గ్రంథాలయం బాధ్యతలు కడప యోగివేమన విశ్వవిద్యాలయానికి బదలాయించారు. 2006 నవంబరు 1న సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంగా నామకరణం చేస్తూ... కడప యోగివేమన విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థగా మార్చారు. తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో సీపీ బ్రౌన్ వార్షిక బడ్జెట్ 30 లక్షల రూపాయలు ఉండగా... చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 36 లక్షల రూపాయలకు పెంచింది.

ప్రస్తుతం కడప సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో దాదాపు 70 వేల పుస్తకాలు ఉన్నాయి. ఇందులో 40 వేల తెలుగు పుస్తకాలు, 20 వేల ఇంగ్లీషు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కన్నడ, ఉర్దూ, సంస్కృతం, హిందీ, తమిళ గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. 250 వరకు తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో లభించే తాళపత్ర గ్రంథాలను తీసుకొచ్చి వాటిని తెలుగులోకి అధ్యయనం చేయడమే కాకుండా డిజిటల్ ముద్రణ చేసే కార్యక్రమం కూడా కొనసాగుతోంది. నెలనెల సాహిత్యం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. రాయలసీమ అధ్యయన కేంద్రం ఇక్కడ ఏర్పాటైంది. వివిధ ప్రాంతాల్లోని కవులు, రచయితలను పిలిపించి కవి గోష్టులు నిర్వహించడం, తెలుగుభాషపై చర్చలు చేయడం చేస్తున్నారు.

నవంబరు 29,30 తేదీల్లో నిర్వహించే సీపీ బ్రౌన్ గ్రంథాలయం రజతోత్సవాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. మరోసారి వ్యక్తిగతంగా వెళ్లి పిలవాలని యోగివేమన విశ్వవిద్యాలయం ఉప కులపతి సూర్య కళావతి భావిస్తున్నారు. రజతోత్సవాలను పురస్కరించుకుని ఆరోజు ప్రత్యేక సంచికలు విడుదల చేయాలని యోచిస్తున్నారు. ఈమేరకు ప్రత్యేక సంచికల ముద్రణ కార్యక్రమం వేగంగా సాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.