వసతి గృహం వార్డెన్, వంట మనిషి మధ్య తలెత్తిన గొడవలతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. విద్యార్థులను బయటికి గెంటేసిన ఘటన కడప జిల్లా సిద్ధవటం మండలంలోని ఎస్సీ వసతి గృహంలో జరిగింది. సిద్ధవటం ఎస్సీ వసతి గృహ వార్డెన్ సుభాషిణికి.. అక్కడ పని చేస్తున్న వంటమనిషికి మధ్య గత కొంత కాలం నుంచి (conflict between warden and cook) వాగ్వాదం జరుగుతోంది. వంట మనిషిని బదిలీ చేయించడానికి వార్డెన్ విద్యార్థులను సంతకం పెట్టమని బలవంతం చేసింది. విద్యార్థులు సంతకాలు పెట్టకపోవడం వల్ల వార్డెన్, కొంతమంది విద్యార్థులను హాస్టల్ నుంచి బయటికి పంపించింది. ఆ విద్యార్థులు మానవ హక్కుల కమిటీ ఛైర్మన్ భరణి కుమార్ నాయుడును ఆశ్రయించారు. ఆయన విద్యార్థులతో సహా కలెక్టరేటుకు వెళ్లారు. వార్డెన్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారి విజ్ఞప్తి మేరకు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి :
Counselling: జోన్-4లో ఉపాధ్యాయ పదోన్నతుల కౌన్సెలింగ్ నిలుపుదల