కడప నగరంలోని 31వ వార్డులో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా రంగంలోకి దిగారు. డీఎస్పీ సునీల్ అడ్డుకున్నారు. దాదాపు అరగంట పాటు ఉద్రిక్తత నెలకొంది. 31వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరపున ఓ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. పోలింగ్ బూత్‌లోకి కాంగ్రెస్ పార్టీ తరపున జనరల్ ఏజెంట్ వచ్చారు. అక్కడే ఉన్న వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా వచ్చారు. కాంగ్రెస్ పార్టీ శిబిరం వద్దకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు అరగంట పాటు ఉద్రిక్తత ఏర్పడింది. ఎట్టకేలకు పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.
ఇదీ చదవండీ... మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ శాతం ఇలా..