ETV Bharat / city

"ఈ నెలాఖరు నాటికి కారుణ్య నియామక ప్రక్రియ పూర్తి"

author img

By

Published : Aug 18, 2019, 9:18 PM IST

ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఇటీవలే సంస్థ పచ్చజెండా ఊపిందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిశెట్టి దామోదర్ రావు తెలిపారు.

అర్టీసీ
మీడియాతో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తవుతుందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిశెట్టి దామోదర్ రావు అన్నారు. ఆర్టీసీ దంపతులకు ఉచిత ప్రయాణం కల్పించే విషయంలో యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. కడప ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ప్రాంతీయ మహాసభ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ విలీనానికి మరో 20 రోజులు మాత్రమే గడువు ఉందని, ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఎవరెన్ని అడ్డంకులు వేసినప్పటికీ ఆర్టీసీ విలీనం జరుగుతుందని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులందరి క్రమబద్ధీకరణకు కృషి చేస్తామని తెలిపారు. విలీన విషయంలో ఏమైన లోటుపాట్లు జరిగితే పోరాటం చేసేందుకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సిద్ధంగా ఉందన్నారు.

Intro:AP_ONG_11_18_NAGABAIRAVA_PURASKARALU_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
............................
ప్రముఖ రచయిత నాగభైరవ కోటేశ్వరరావు జయంతి సందర్భంగా నాగభైరవ కళాపీఠం ఆధ్వర్యంలో నాగభైరవ పరిష్కారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ హరిబాబు ప్రజానాట్యమండలి నాయకుడు నల్లూరి వెంకటేశ్వర్లు, నాగభైరవ కుటుంబ సభ్యులు కవులు, కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గా నాగభైరవ ఆత్మీయ పురస్కారాన్ని ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నెలకంటి కి ప్రధానం చేశారు.. నాగభైరవ సాహిత్య పురస్కారాన్ని నీలిగోరింట గ్రంథకర్త, ప్రముఖ రచయిత్రి మందారపు హైమావతి కి అందించారు. నాగభైరవ కోటేశ్వరావు కుటుంబ సభ్యులు ఇరువురు రచయితలను ఘనంగా సన్మానించారు. సినీగేయ రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ..... నాగభైరవ కోటేశ్వర రావు తో గుర్తు చేసుకున్నారు. తొలి పరిచయంలోనే తనపై అభిమానాన్ని చాటుతూ నాగభైరవ పలికిన "కోటి నయాగారాలు తన గొంతుతో పలికించిన కొత్త కవి మిత్రుడు మన వెన్నెలకంటి" పలుకులను వెన్నలకంటి స్మరించుకున్నారు. నాగభైరవ కోటేశ్వరరావు తన తండ్రి తర్వాత తండ్రిని అంతటివారని వెన్నెలకంటి అన్నారు. తన కుటుంబ సభ్యులే తనకు సన్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. నంది పురస్కారం తో పాటు ఎన్నో పురస్కారాలు తన జీవితంలో అందుకున్నా కానీ ఈ పురస్కారం తీసుకున్నప్పుడు కలిగిన ఆనందం మరేనాడు కలగ లేదని అంటూ వెన్నెలకంటి నాగభైరవ కోటేశ్వరరావుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు...బైట్
వెన్నలకంటి, ప్రముఖ సినీ గేయ రచయిత.

Body:ఒంగోలు

Conclusion:9100075319

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.