ETV Bharat / city

viveka murder case: కొత్తగా నలుగురిని విచారిస్తున్న సీబీఐ - వివేకా హత్య కేసు 12వ రోజు విచారణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 12వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో జరుగుతున్న విచారణలో భాగంగా.. ఇవాళ కొత్తగా నలుగురు అనుమానితులు హాజరయ్యారు.

viveka murder case
వివేకానందరెడ్డి హత్య కేసులో 12వ రోజు సీబీఐ విచారణ
author img

By

Published : Jun 18, 2021, 10:40 AM IST

Updated : Jun 18, 2021, 1:37 PM IST

మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో 12వ రోజు విచారణ జరుగుతోంది. ఇవాళ ఏకంగా ఆరుగురు అనుమానితులు విచారణకు హాజరయ్యారు. వివేకా ప్రధాన అనచరుడు ఎర్ర గంగిరెడ్డి వరసగా రెండో రోజు విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలపై సిట్ అధికారులు ఎర్ర గంగిరెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను బెయిల్​పై ఉన్నారు.

వరుసగా మూడో రోజు..

ఇతనితోపాటు సింహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన వివేకా సన్నిహితుడు జగదీశ్వర్ రెడ్డి వరసగా మూడోరోజు విచారణకు హాజరయ్యారు. ఇతను వివేకా పొలం పనులు చూస్తుండేవాడు. పులివెందులకు కాఫీ పొడి వ్యాపారీ సుగుణాకర్​ను కూడా సీబీఐ అధికారులు విచారణకు పలిచారు. వీరితోపాటు కడపకు చెందిన మోహన్ ఆసుపత్రి యజమానికి లక్ష్మీరెడ్డి, చిన్నపరెడ్డి, రామచంద్రారెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ముమ్మరంగా విచారణ..

11వ రోజు నలుగురు అనుమానితులను సీబీఐ అధికారులు దాదాపు 7 గంటల పాటు కడపలో ప్రశ్నించారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో పది మంది సీబీఐ అధికారుల బృందం.. అనుమానితులను విచారించారు. వీరిలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డిని సుదీర్ఘంగా విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 మార్చి 15న హత్య జరిగిన రాత్రికి ముందు ఎన్నికల ప్రచారానికి వివేకాతో కలిసి కారులో వెళ్లింది ఎర్ర గంగిరెడ్డే. వివేకా ఇంటినుంచి బయటికి వెళ్తే.. ఎర్రగంగిరెడ్డి వెంట ఉండేవాడు. హత్య జరిగిన రోజు ఉదయం ఇంట్లో సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలపై ఎర్రగంగిరెడ్డితోపాటు కృష్ణారెడ్డి, ప్రకాశ్ అనే వ్యక్తులను రెండేళ్ల కిందట సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బెయిలుపై ఉన్న ఎర్రగంగిరెడ్డిని సీబీఐ అధికారులు మరోమారు కడపకు పిలిచి విచారించారు. ఇతనితోపాటు సింహాద్రిపురం మండలం సుంకేశుల గ్రామానికి చెందిన జగదీశ్వర్ రెడ్డి, ఆయన భార్య మహేశ్వరిని విచారణకు పిలిచారు. వివేకా వ్యవసాయ పొలం పనులు చూసే జగదీశ్వర్ రెడ్డి...ఆయనతో సన్నిహితంగా ఉండే వాడని తెలిసింది. 2 రోజుల పాటు జగదీశ్వర్ రెడ్డిని ప్రశ్నించగా... ఆయన భార్య మహేశ్వరిని కూడా విచారణకు పిలవడం చర్చనీయాంశమైంది. వీరితోపాటు గతంలో వివేకాతో సన్నిహితంగా ఉండే పులివెందులకు చెందిన గని యజమాని గంగాధర్ ను సీబీఐ విచారణకు పిలిచింది. కాల్ డేటా ఆధారంగా సీబీఐ అధికారులు పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి..

Lovers suicide: విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య

Last Updated : Jun 18, 2021, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.