మాజీమంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో 14వ రోజు విచారణ కొనసాగుతోంది. ఇవాళ సీబీఐ విచారణకు మొత్తం 8 మంది హాజరయ్యారు. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని 4వ రోజు ప్రశ్నిస్తున్నారు. అశోక్ కుమార్, ఓబులపతి, రాఘవేంద్ర అనే ముగ్గురిని అధికారుల బృందం విచారిస్తోంది. పులివెందులకు చెందిన దంపతులు కృష్ణ, సావిత్రితోపాటు శ్రీరాములు, హరినాథ్‌రెడ్డి కూడా విచారణకు హాజరుయ్యారు.
సాక్ష్యాల తారుమారు అభియోగాలపై...
వివేకాకు అత్యంత సన్నిహితుడుగా పనిచేసిన ఎర్ర గంగిరెడ్డి.. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగిన రోజు ఆయన ఇంట్లో సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలపై రెండేళ్ల కిందటే సిట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పైన ఉన్న ఎర్ర గంగిరెడ్డిని అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి..
viveka murder case: వివేకా హత్య కేసు.. మూడో రోజూ హాజరైన ఎర్ర గంగిరెడ్డి