ETV Bharat / city

Viveka murder case: వివేకా హత్య కేసు విచారణ.. ఐదుగురిని ప్రశ్నించిన సీబీఐ - కడప తాజా వార్తలు

కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ జరుగుతోంది. ఇవాళ 6 గంటలపాటు.. ఐదుగురు అనుమానితులను అధికారుల బృందం ప్రశ్నించింది.

cbi on viveka murder case
వివేకా హత్య కేసు విచారణ
author img

By

Published : Jul 10, 2021, 8:51 PM IST

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో ఇవాళ ఐదుగురు అనుమానితులను విచారించారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి, మాజీ కారు డ్రైవర్ దస్తగిరి, పులివెందులకు చెందిన నాగప్ప, వివేకా ఇంట్లో పనిచేసే వంటమనిషి, లక్ష్మీదేవి, పనిమనిషి లక్ష్మమ్మలను సీబీఐ అధికారులు విచారించారు. దాదాపు ఆరు గంటల పాటు ఐదుగురిని విచారించారు. హత్య జరిగిన రోజు ముందుగా వివేకా ఇంటికి వెళ్లింది పీఏ కృష్ణారెడ్డే అని సీబీఐ అధికారులకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఐదుగురిని సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు సమాచారం.

గోప్యంగా కొనసాగుతోంది..

కడప కేంద్ర కారాగారంలో నెల రోజుల నుంచి సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. విచారణలో భాగంగా శుక్రవారం వివేకానంద రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డితో పాటు పులివెందులకు చెందిన ఉమామహేశ్వర్, మాజీ డ్రైవర్లు దస్తగిరి, ప్రసాద్​తో పాటు మరో వ్యక్తిని సీబీఐ అధికారులు విచారించారు. వీరి నుంచి సీబీఐ అధికారులు పలు కీలక అంశాలను రాబట్టారు. కేసు విచారణ మొత్తం అతికొద్దిమంది చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను అధికారులు నమోదు చేసుకున్నారు. విచారణ మొత్తం అత్యంత గోప్యంగా కొనసాగుతోంది.

సుదీర్ఘ విచారణతో..

వివేకాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు, రాజకీయాలు అన్నీ కూడా ఎర్ర గంగిరెడ్డి కనుసన్నల్లోనే జరిగేవనే ఆరోపణలు ఉన్నాయి. వివేకా ఎక్కడికి వెళ్లినా ఎర్ర గంగిరెడ్డి తోడుగా వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో వివరాల సేకరణకు ఇతన్ని గతంలోనే సిట్ అధికారులు గుజరాత్ తీసుకెళ్లి నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించారు. ఇపుడు సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తుండటం చర్చనీయాంశమైంది. హత్య జరిగిన రోజు గదిలో సాక్ష్యాధారాలు ఎందుకు చెరిపి వేయాల్సి వచ్చిందనే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు వివేకాకు ఎర్ర గంగిరెడ్డితో ఉన్న సంబంధాలు, ఆర్థిక విషయాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి..

Attack: చిలకలూరిపేట వైకాపాలో వర్గ పోరు..పురపాలిక ఉపాధ్యక్షుడిపై దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.